UK PM | ఇరాన్ యుద్ధంలోకి ఎట్టి పరిస్థితుల్లో దిగబోం : యూకే ప్రధాని కీర్ స్టార్మర్
UK PM | పశ్చిమాసియా (West Asia) ఘర్షణలతో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో తీవ్ర అంతరాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో యూకే ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే మార్గాలపై చర్చించేందుకు ప్రపంచస్థాయి సదస్సు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
UK PM : పశ్చిమాసియా (West Asia) ఘర్షణలతో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో తీవ్ర అంతరాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో యూకే ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే మార్గాలపై చర్చించేందుకు ప్రపంచస్థాయి సదస్సు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి దౌత్యమార్గాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. అయితే ఇరాన్ యుద్ధంలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దిగబోమని తేల్చిచెప్పారు.
హర్మూజ్ జలసంధి విషయంలో తన మాట వినని యూకేకు అమెరికా సాయం చేయబోదన్న ట్రంప్ హెచ్చరికలపై స్టార్మర్ స్పందిస్తూ.. ఎవరు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా బ్రిటిష్ జాతీయ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తానన్నారు. అది తమ యుద్ధం కాదని, అందువల్లే అందులోకి వెళ్లదలుచుకోలేదని స్పష్టంచేశారు. ప్రస్తుత సంఘర్షణలతో యూకే భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం పడుతోందని.. ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంవల్ల జీవన వ్యయం పెరుగుతుందని అన్నారు.
అయినప్పటికీ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని స్టార్మర్ చెప్పారు. ప్రస్తుత సమయంలో అమెరికాతో కంటే సహచర ఐరోపా దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటమే బ్రిటన్కు ప్రయోజనకరమని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

