చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని ఓ దుకాణం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ స్టోర్ ఉన్నది నేలపై కాదు.. ఓ కొండ అంచున వేలాడుతూ ఉండటమే ఇందుకు కారణం. పింగ్జియాంగ్ కౌంటీలోని ఓ జాతీయ పార్క్‌లో చెక్కతో తయారు చేసిన ఈ వినూత్న స్టోర్‌ను.. పర్వతారోహకుల కోసం ఏర్పాటు చేశారు.
పర్వతాన్ని ఎక్కే క్రమంలో మధ్యలో రీఫ్రెష్ అయ్యేందుకు, స్నాక్స్ తినేందుకు ఇది ఉపయోపడుతుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఓ నెటిజన్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.