రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వస్తే బంగారం కొనగలమా?
రష్యా- ఉక్రెయిన్ దేశాలు దాదాపుగా యుద్ధం ముగింటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రపంచ రాజకీయ యవనిక రెండు ధృవాలుగా మారిపోయింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా సర్వశక్తులూ ఒడ్డుతోంది. రష్యా మాత్రం ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. అయితే.. ఒకవేళ యుద్ధమంటూ వస్తే… కొన్నింటి ధర అమాంతం పెరిగే సూచనలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంగారం..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే బంగారం మరింత బంగారమైపోయే సూచనలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదం ముదిరిన వేళనే బంగారం కాస్త ప్రియమైంది. ఇక.. రెండు వేర్వేరు ప్రాంతాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ బలగాలను పంపిన వేళ… బంగారం ధర తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మార్కెట్ విశ్లేషకుడు జెఫ్రీహైలీ మాట్లాడుతూ… తూర్పు యూరప్‌లో పరిస్థితి నానాటికి దిగజారుతోందని, ఈ స్థితి బంగారం ధరల పెరుగదలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అల్యూమినియం
ఇరు దేశాల మధ్య యుద్ధమంటూ వస్తే అల్యూమినియం ధరలు కూడా పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచం మొత్తం అల్యూమినియం సరఫరాలో 6 శాతం రష్యాయే చేస్తుంది. దీంతో అల్యూమినియం సరఫరాపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో అల్యూమినియం లభ్యత తక్కువగా ఉంది. ఇప్పటికే అల్యూమినియం ధర ప్రపంచ మార్కెట్లో 15 శాతం పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
చమురు
బంగారం, అల్యూమినియం ధరలతో పాటు చమురు ధరలు కూడా పెరుగుతాయని ఓ అంచనా. తాజా ప్రకటన వల్ల ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చమురు ధర పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. చమురు, గ్యాస్‌కు సంబంధించి ప్రధాన వనరుగా ఉంది. ఒక్క రోజులోనే 9 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రష్యా ఉత్పత్తి చేస్తుందని అంచనా.
సహజ వాయువు
ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే సహజవాయువు ధరలు కూడా పెరగతాయని ఓ అంచనా. ఎందుకంటే ప్రధానంగా సహజవాయువు ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా ఒకటి. ఓ రిపోర్టు ప్రకారం.. 2021 లో రష్యా 639 బిలియన్ల క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ యేడాది 3.854 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు ఉత్పత్తి జరిగిందని ఆ రిపోర్టు తెలిపింది. అంటే ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో రష్యా వాటా 17 శాతం. వీటన్నింటితో పాటు రాగి, కోబాల్ట్ ధరలు కూడా పెరుగుతాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- copper
- gold
- prices increases
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

