వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐలపై ‘న్యూయార్క్ టైమ్స్’ మీడియా సంస్థ చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. తాను ప్రచురిస్తున్న లక్షలాది ఆర్టికల్స్‌ను ఈ రెండు కంపెనీలు అనధికారికంగా కాపీ చేసి, ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది.
తన కంటెంట్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ చాట్‌జీపీటీ (ఓపెన్ఏఐ), కోపైలట్ (మైక్రోసాఫ్ట్)ల అభివృద్ధి కోసం వినియోగించుకుంటున్నాయని తెలిపింది. కోపైలట్, చాట్‌జీపీటీ వంటి మోడల్స్ మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ కంపెనీల సాంకేతిక సామర్థ్యాన్ని, మార్కెట్ పోటీని పెంచడానికి దోహదపడినట్లు తెలిపింది. ఈ మోడల్స్ వల్ల తమ సబ్స్క్రిప్షన్, లైసెన్సింగ్, అడ్వర్టయిజింగ్ ఆదాయం కోల్పోతున్నట్లు వివరించింది.