లండన్: పుస్తక పఠనం పట్ల ఆసక్తిగలవారందరికీ ఏప్రిల్ 30 అత్యంత విచారకరమైన రోజు. అనేక మందికి విజ్ఞానాన్ని పంచి, స్ఫూర్తి, ప్రేరణలనిచ్చిన ‘ది రీడర్స్ డైజెస్ట్’ ముద్రణ ఎడిషన్ అదే రోజున మూతపడింది.
ఈ వార్తను తెలియజేస్తూ ఈ మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎవా మకెవిక్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో అంతర్జాతీయ పుస్తక దినోత్సవం నాడు విడుదల కావడం గమనార్హం.