America | అమెరికా నుంచి కొవిడ్ తరహా వైరస్! హార్వర్డ్ లా స్కూల్, న్యూయార్క్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
America | కొవిడ్-19 సంక్షోభంతో ప్రపంచం యావత్తు బెంబేలెత్తిపోయింది. వైరస్ భయాలు, ఆంక్షలు తలుచుకుంటే కొంతమందికి ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. అయితే కరోనా లాంటి మరో వైరస్ అమెరికా నుంచి రావొచ్చునని తాజా అధ్యయనం ఒకటి అంచనా చేసింది.
- జంతువుల దిగుమతి, వధపై నియంత్రణ
- నామమాత్రం ఇలాగైతే మరో మహమ్మారి రావొచ్చు: తాజా అధ్యయనం
America | వాషింగ్టన్: కొవిడ్-19 సంక్షోభంతో ప్రపంచం యావత్తు బెంబేలెత్తిపోయింది. వైరస్ భయాలు, ఆంక్షలు తలుచుకుంటే కొంతమందికి ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. అయితే కరోనా లాంటి మరో వైరస్ అమెరికా నుంచి రావొచ్చునని తాజా అధ్యయనం ఒకటి అంచనా చేసింది. ఇతర దేశాల నుంచి జంతువుల దిగుమతి, పశువుల తరలింపు, వధకు సంబంధించి అమెరికాలో కట్టుదిట్టమైన నియంత్రణ లేదని, ఫాంహౌజ్ల్లో పనిచేసే వారు జునోటిక్స్ (జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు) బారిన పడే అవకాశముందని, అనంతరం ఇది కరోనా వంటి మహమ్మారిగా మారే ప్రమాదముందని ‘హార్వర్డ్ లా స్కూల్, న్యూయార్క్ వర్సిటీ’ అధ్యయనం పేర్కొన్నది. అమెరికాలో పందులు, కోళ్ల ఫామ్లు, పశువులు, క్రూర మృగాలకు సంబంధించి మార్కెట్లపై సరైన నియంత్రణలు, నిబంధనలు పాటించటం లేదని అధ్యయనం తెలిపింది.
నివేదిక రూపకల్పనలో ఒకరైన యాన్ లిండర్ మాట్లాడుతూ, ‘జునోటిక్స్ ముప్పు అమెరికాకే ఎక్కువ. కోళ్లు, పశువుల పెంపకం జనాల మధ్యలోకి వచ్చింది. క్రూర మృగాల క్రయవిక్రయాలు, దిగుమతి, తరలింపు సమయాల్లో హెల్త్ చెకప్లు చేయటం లేదు. కాబట్టి ప్రమాదకర వైరస్ మానవులకు సోకే అవకాశముంది’ అన్నారు. గ్లోబలైజేషన్ వల్ల అడవులు, కొండలు, గుట్టలు, ఇతర సహజ ఆవాసాలు..దెబ్బతినటంతో కొత్త వైరస్లు వస్తాయని నివేదిక తెలిపింది. అమెరికాకు ఏటా దాదాపు 22 కోట్ల జంతువులు దిగుమతి అవుతున్నాయి. జంతు చర్మాల మార్కెట్లు, పందులు, కోళ్ల పెంపకంలో వైరస్ ఇతరులకు సులభంగా సోకే అవకాశముందని యానిమల్ లా, పాలసీ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ విండర్స్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

