చైనాలో దశాబ్దంలోనే అతిపెద్ద ఇసుక తుఫాన్
చైనాలో సోమవారం ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. గాలి దుమారం వల్ల సమీపంలోని భవనాలు, రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. రాజధాని బీజింగ్ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ర్టాలపై తుఫాన్ ప్రభావం చూపినట్టు అంచనా వేశారు. ప్రభావిత ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ మంగోలియాలోని గోబి ఎడారిలో ఈ ఇసుక తుఫాన్ ప్రారంభమైనట్టు జాతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం రాత్రి హుబేయి ప్రొవిన్స్ వరకు చేరుకున్న ఈ ఇసుక తుఫాన్ సోమవారం ఉదయం నాటికి బీజింగ్ సహా పలు ప్రొవిన్స్లకు వ్యాపించినట్టు వివరించింది. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత తీవ్రమైన ఇసుక తుఫాన్గా అభివర్ణించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

