వాలెంటైన్స్ డే : సురక్షిత శృంగారం కోసం 9.5 కోట్ల ఉచిత కండోమ్‌ల పంపిణీ
వాలెంటైన్స్ డేకు ముందు థాయ్‌లాండ్ ప్రభుత్వం 9.5 కోట్ల కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. లైంగిక వ్యాధులకు, టీనేజర్ల గర్భధారణకు చెక్ పెడుతూ సురక్షిత శృంగారం కోసం థాయ్‌లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాంకాక్ : వాలెంటైన్స్ డేకు ముందు థాయ్‌లాండ్ ప్రభుత్వం 9.5 కోట్ల కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. లైంగిక వ్యాధులకు, టీనేజర్ల గర్భధారణకు చెక్ పెడుతూ సురక్షిత శృంగారం కోసం థాయ్‌లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి యూనివర్సల్ హెల్త్‌కేర్ కార్డుదారులు ఏడాది పాటు వారానికి 10 ఉచిత కండోమ్‌లు పొందుతారని థాయ్‌లాండ్ ప్రతినిధి రచద ధనదిరెక్ వెల్లడించారు.
గోల్డ్కార్డుదారులకు ఉచిత కండోమ్‌లను పంచే క్యాంపెయిన్‌తో వ్యాధుల నియంత్రణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. సిఫిలిస్, ఎయిడ్స్, గనేరియా వంటి శృంగారం ద్వారా వ్యాప్తి చెందే (ఎస్టీడీ) వ్యాధుల నియంత్రణకు నాలుగు సైజ్‌ల్లో ఉండే ఈ కండోమ్‌లు ఫార్మసీలతో పాటు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని థాయ్‌లాండ్ నేషనల్ హెల్త్ సెక్యూరిటీ కార్యాలయం (ఎన్హెచ్ఎస్ఓ) వెల్లడించింది.
2021లో థాయ్‌లాండ్‌లో ప్రబలిన ఎస్టీడీల్లో యాభై శాతం పైగా కేసులు గనేరియాగా నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. 15 నుంచి 24 ఏండ్ల లోపు యువత అధికంగా ఈ వ్యాధుల బారినపడుతోందని వెల్లడైంది. 15 నుంచి 19 ఏండ్ల వయసున్న ప్రతి 1000 మంది థాయ్ బాలికల్లో 2021లో 24.4 మంది శిశువులకు జన్మనిచ్చారని గణాంకాలు స్పష్టం చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

