కెనడియన్ (యూఎస్): అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కార్చిచ్చులు బీభత్సం సృష్టించాయి. ఎండుగడ్డికి గాలి తోడవడంతో కార్చిచ్చులకు మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందల ఎకరాల్లో వృక్షాలను కార్చిచ్చులు దహించివేశాయి.
60 కౌంటీలలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. కార్చిచ్చు నేపథ్యంలో ఓ అణు ఆయుధగారాన్ని తాత్కాలికంగా మూసివేశారు.