Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Tesla Flying Car: కొన్ని డజన్ల ఫీట్ల ఎత్తుకు టెస్లా కారు ఎగిరింది. ప్రత్యేకమైన ర్యాంప్‌పై మీదకు వెళ్లి.. మళ్లీ సేఫ్‌గా కిందకు దిగింది. మరో డెమోలో ఆ ఫ్లయింగ్ కారు కొన్ని స్టంట్లు కూడా చేసింది. రోడ్‌స్టర్ 2 ఫ్లయింగ్ కారుకు చెందిన డెమో వీడియోను టెస్లా రిలీజ్ చేసింది.
టెక్సాస్ : టెస్లా కంపెనీ నుంచి కొత్త కారు వస్తోంది. గాలిలో ఎగురుతూ డ్రైవింగ్ చేసే ఆ కారు(Tesla Flying Car)ను టెస్లా కంపెనీ తాజాగా పరీక్షించింది. భూమి నుంచి కొన్ని ఫీట్ల మేర మీదకు ఎగురుతూ.. మళ్లీ కిందకు వాలిన ఆ కారు డెమోను టెస్లా కంపెనీ నిర్వహించింది. టెక్సాస్‌లోని మెక్గ్రేగర్లో ఉన్న స్పేస్ఎక్స్ రాకెట్ డెవలప్మెంట్ కేంద్రంలో రోడ్‌స్టర్ 2 కారుకు చెందిన డెమో ప్రదర్శన జరిగింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ర్యాంప్‌పై ఆ ఫ్లయింగ్ కార్ తన స్టంట్స్ నిర్వహించింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్‌కు చెందిన పరిశోధనలు చాన్నాళ్ల నుంచే జరుగుతున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ టెక్నాలజీతో ఈ కారును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మస్క్ తన ఎక్స్‌లో ఓ వీడియో షేర్ చేశారు. భవిష్యత్తులో ఫ్లయింగ్ కార్స్ వస్తాయేమో అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Turns out the future does have flying cars https://t.co/6fexPp6SXI
— Elon Musk (@elonmusk) October 16, 2026
ఫ్లయింగ్ కారులో కోల్డ్ గ్యాస్ థ్రస్టర్స్‌ను వాడారు. ప్రెజర్ గ్యాస్ వల్ల థ్రస్ట్‌ను జరేట్ చేస్తారు. దీంతో ఆ కారు గాలిలో కాసేపు ఎగరగలుగుతుంది. సాధారణ కారులతో ఇలాంటి స్టంట్ చేయడం సాధ్యం కాదు. అయితే ప్రత్యేక నియంత్రిత ప్రదేశంలో రోడ్‌స్టర్2 కారు డెమో ప్రదర్శన చేశారు. కానీ వాస్తవానికి పబ్లిక్ రోడ్లలో మాత్రం ఇలాంటి కార్లకు పర్మిషన్ ఉండదు. రోడ్‌స్టర్ మోడల్‌కు చెందిన నెక్ట్స్ జనరేషన్ కార్ల గురించి టెస్లా కంపెనీ 2017లో ప్రకటన చేసింది. కానీ ఆ కార్ల ఉత్పత్తిలో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. అయితే ఈ కొత్త ఫ్లయింగ్ కార్లను 2028లో ఉత్పత్తి చేసేందుకు టెస్లా కంపెనీ ఇప్పుడు రెఢీ అయ్యింది. కానీ కమర్షియల్‌గా ఈ కారు మార్కెట్లో వచ్చేందుకు కస్టమర్లు మరింత కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది.
Real life, baby https://t.co/3QEqn18wig
— Tesla (@Tesla) October 16, 2026
ఫ్లయింగ్ కార్లకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా లేదా అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉన్నది. ఎందుకంటే ఇదంతా ఏవియేషన్ నియమావళి కిందకు వస్తుంది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ శాఖ మాత్రం ఇంకా ఫ్లయింగ్ కార్ల గురించి కామెంట్ చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

