వాషింగ్టన్: ఆటోపైలట్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. అమెరికాలోని హ్యూస్టన్‌కు ఉత్తరాన శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా ప్రాంతానికి వచ్చి చూడగా డ్రైవర్ సీటులో ఎవరూ లేరు. డ్రైవర్ పక్క సీటులో, వెనుక సీటులో కూర్చొన్న ఇద్దరు ఈ ప్రమాదంలో చనిపోయారు. కారు ఆటోపైలట్ మోడ్‌లో వేగంగా ప్రయాణిస్తూ మలుపును గుర్తించక తిన్నగా వెళ్లి చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు టెస్లా సెల్ఫ్ డ్రైవర్ కార్లు తరచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలపై టెస్లా తన వెబ్సైట్లో హెచ్చరికలు చేసింది. తమ వాహనాలు పూర్తిగా ఆటోపైలట్ కాదని, డ్రైవర్ పర్యవేక్షణ అవసరమని పేర్కొంది.