Shehbaz Sharif | ఉగ్రవాదమే మా ప్రధాన సమస్య : పాక్ ప్రధాని
Shehbaz Sharif | తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. బుధవారం పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు వ్యాన్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడిలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
Shehbaz Sharif | తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. బుధవారం పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు వ్యాన్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడిలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
‘పాకిస్థాన్ ఎదుర్కొంటున్న సమస్యల్లో అన్నింటికంటే ప్రధానమైనది ఉగ్రవాదమే. దేశాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోంది. ఉగ్రవాదంపై పోలీసులు, సైనికులు అత్యంత సాహసంతో పోరాడుతున్నారు. ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు వ్యాన్‌పై జరిగిన ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడంలేదు. దాడిలో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
ఖైబర్ ఫక్తుంఖ్వాలోని లాకీ మార్వాత్‌లో ఓ పోలీస్ వ్యాన్‌పై బుధవారం ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ వజీరిస్థాన్ సరిహద్దులోని లకీ మార్వాత్ జిల్లాలో గుర్తుతెలియని ముష్కరులు పోలీసులు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి తెగబడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
Let us make no mistake. Terrorism continues to be one of Pakistan's foremost problems. Our armed forces & police have valiently fought the scourge. No words are enough to condemn terrorists' attack on a police van in Lakki Marwat. My thoughts & prayers are with bereaved families.
— Shehbaz Sharif (@CMShehbaz) November 16, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

