న్యూయార్క్ అటార్నీ జనరల్ బరిలో తెలంగాణ మహిళ
న్యూయార్క్, అక్టోబర్ 29: న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి అధికార రిపబ్లికన్ అభ్యర్థిగా తెలంగాణ మహిళ ఒకరు పోటీపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాలో అల్-ఖైదా, ఐసిస్‌ల కేసుల విచారణలో భాగస్వామి అయిన సరిత కోమటిరెడ్డి అక్కడి ప్రజా జీవితంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్న అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన కాలం నుంచి యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో చీఫ్ స్టాఫ్‌గా పనిచేసిన కాలం వరకు తనను ఇక్కడికి తీసుకువచ్చిన అనుభవాల గురించి ఆమె మాట్లాడారు. నేరాలు, చిల్లర దొంగతనాలు, మోసాలపై చర్య తీసుకుంటానని ఆమె హామీనిచ్చారు. ప్రజాభద్రత గురించిన ఆందోళనలే తనను ఈ ఎన్నికల బరిలోకి దింపాయని, ఇప్పటికే జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న న్యూయార్క్ వాసులకు నేరాలు, మోసాలు జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అటార్నీ జనరల్ నేరాలు, మోసాలపై విచారణ జరపడంపై దృష్టి పెట్టాలని, అలాగే నేరస్తుల నుంచి డబ్బును రాబట్టి దానిని తిరిగి పన్ను చెల్లింపుదారులకు అందజేయాలని ఆమె తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

