కాబుల్: టీవీల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో.. మహిళల పాత్రలపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు నిషేధం విధించారు. స్థానిక తాలిబన్ ప్రభుత్వం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్లు విధించిన కొత్త రూల్స్ చాలా విచిత్రంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. వాళ్లు మెల్లమెల్లగా చాలా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. అమెరికా దళాలు ఉపసంహరించిన తక్షణమే.. బాలికలు, మహిళలు స్కూళ్లకు వెళ్లవద్దు అంటూ తాలిబన్లు ఆదేశించిన విషయం తెలిసిందే. మహిళలు నటించిన షోలను ప్రసారం చేయవద్దు అంటూ ఆఫ్ఘన్ టీవీ ఛానళ్లకు తాలిబన్ల మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్న సినిమాలను బ్యాన్ చేయాలన్నారు. టీవీ షోల్లో పురుషులు తమ శరీరాలను చూపించరాదు. మతంపై జోక్‌లు వేసే కామిడీ షోలను బ్యాన్ చేశారు.