ఆ పని చేయకండి.. టాక్సీ డ్రైవర్లకు తాలిబన్ ఆదేశం

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ తాజాగా టాక్సీ డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. తుపాకులు కలిగిన ఇతరులను వాహనాల్లో తరలించవద్దని పేర్కొంది. తాలిబన్, అనుబంధ వ్యక్తులు తప్ప ఇతర గన్మెన్లను టాక్సీలలో తరలించవద్దని తూర్పు నంగర్హర్ ప్రావిన్స్‌లోని టాక్సీ డ్రైవర్లను ఆదేశించింది.
అలాగే టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్మెన్లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రావిన్స్ ప్రజలను తాలిబన్ కోరింది. ప్రజల భద్రత కోసం తమకు సహకరించాలంటూ నంగర్హర్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబన్ అధికారి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు ప్రావిన్సులలో చురుకుగా ఉన్న ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాదులు ఇటీవల తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని పలు బాంబు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో తాలిబన్లతోపాటు పౌరులు కూడా మరణిస్తుండటంతో స్థానికుల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. ఈ నేపథ్యంలో తాలిబన్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

