Tahawwur Rana: తహవుర్ రాణా స్టే పిటీషన్‌ను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు
Tahawwur Rana: తనను భారత్‌కు అప్పగించవద్దు అని 2008 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ రాణా పెట్టుకున్న పిటీషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన అప్పగింతపై అత్యవసరంగా స్టే విధించాలని సుప్రీంకోర్టులో రాణా అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్: తనను భారత్‌కు అప్పగించవద్దు అని 2008 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ రాణా(Tahawwur Rana) పెట్టుకున్న పిటీషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన అప్పగింతపై అత్యవసరంగా స్టే విధించాలని సుప్రీంకోర్టులో రాణా అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇండియాకు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను చిత్రహింస పెడుతుందని తన అభ్యర్థన లేఖలో అమెరికా సుప్రీంకోర్టుకు రాణా తెలిపాడు. అందుకే అప్పగింతపై తక్షణమే స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాడు.
తాను పాకిస్థానీ సంతతికి చెందిన ముస్లింనని, తాను పాకిస్థానీ సైన్యానికి చెందిన మాజీ సభ్యుడినని అతను తెలిపాడు. ఈ కారణంగానే కస్టడీలో తనను చిత్రహింసలు పెడతారని అనుమానించవలసి వస్తోందని, తనను ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టవద్దని కోర్టును రాణా అభ్యర్థించాడు. పాకిస్థానీ అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సన్నిహితుడు తహవూర్ రాణా. 2008, నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్ర పేలుళ్లలో హేడ్లీ ప్రధాన నిందితుడు. రాణాకు పాక్‌లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకు ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

