Syria | సిరియాలో మళ్లీ సంక్షోభం.. ఇస్లామిక్ రెబల్స్ భీకర దాడులు
అంతర్యుద్ధంతో దాదాపు దశాబ్ద కాలంపాటు అట్టుడికిన సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘హయత్ తహ్రీర్ అల్-షామ్' ఇస్లామిక్ గ్రూపునకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు సిరియాలో రెండవ అతిపెద్ద నగరమైన అలెప్పోలో భీకర దాడులకు దిగారు.
- దాడుల్లో 300 మందికిపైగా హతం
- అలెప్పోలోని పలు కీలక ప్రాంతాలు స్వాధీనం
- బషర్ సేనలకు అండగా నిలిచిన రష్యా
- వైమానిక దాడుల్లో 300 మందికిపైగా హతం
Syria | న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అంతర్యుద్ధంతో దాదాపు దశాబ్ద కాలంపాటు అట్టుడికిన సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘హయత్ తహ్రీర్ అల్-షామ్’ ఇస్లామిక్ గ్రూపునకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు సిరియాలో రెండవ అతిపెద్ద నగరమైన అలెప్పోలో భీకర దాడులకు దిగారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ దాడుల్లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ సేనలను వెనక్కి నెడుతూ అలెప్పో విమానాశ్రయంతోపాటు ఆ నగరంలో సగానికిపైగా ప్రాంతాన్ని, ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని మరాత్ అల్ నమన్ నగరాన్ని, అనేక పట్టణాలను, గ్రామాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సిరియా ప్రభుత్వ దళాలకు రష్యా అండగా నిలిచింది. తిరుగుబాటుదారులపై భీకర స్థాయిలో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 300 మందికిపైగా తిరుగుబాటుదారులు హతమయ్యారని ‘టాస్’ వార్తా సంస్థ వెల్లడించింది.
అసద్ వ్యతిరేక నిరసనలతో మొదలై..
2011లో కొందరు ప్రజాస్వామ్య అనుకూల వాదులు సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ గద్దె దిగాలంటూ వీధులలో ప్రదర్శనలను చేశారు. ఈ అంతర్యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న అసద్ ప్రభుత్వ దళాలు వారి ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేశాయి. అయితే చిన్న ఆర్గానిక్ మిలీషియాలు, సిరియన్ మిలిటరీ నుంచి వచ్చిన కొందరితో కలిసి ఒక సాయుధ ప్రతిపక్షం ఏర్పడటం ప్రారంభించింది. అయితే ఈ సంస్థల ఆలోచనలు, వ్యూహాలు భిన్నంగా ఉన్నప్పటికీ అసద్‌ను దించేయాలన్న ఏకైక లక్ష్యం వారిని ఒక్కటి చేసింది. దానికి తోడు వీరికి పొరుగున ఉన్న టర్కీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు అమెరికా కూడా వివిధ మార్గాల్లో సహకారం అందించేవి.
వీరి కార్యకలాపాలు పెరుగుతుండటంలో అప్రమత్తమైన సిరియా.. రష్యా, ఇరాన్ లాంటి మిత్రదేశాలతో బంధం మరింత బలోపేతం చేసుకుంది. సహజంగానే జిహాదీల ప్రమేయాన్ని సిరియా ఇష్టపడేది కాదు. దాంతో ఇస్లామిక్ సంస్థలు ఆ దేశాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించాయి. 2014 నాటికి తిరుగుబాటుదారులు దేశంలోని పలు ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించారు. 2016 నాటికి రష్యా, ఇరాన్ మద్దతుతో సైనిక తిరుగుబాటుదారులను సిరియా పూర్తిగా అణచివేసి అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకుంది.
అదును చూసి..
సిరియా మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్ ప్రస్తుతం యుద్ధాల్లో నిమగ్నమైనందున అవి సిరియాకు సాయం చేయకపోవచ్చని భావించిన ‘హయత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూప్ తిరిగి దాడులు ప్రారంభించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

