Sydney mall attack : ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీలోగల ఓ షాపింగ్ మాల్లో శనివారం మధ్యాహ్నం ఆరుగురిని పొడిచి చంపిన వ్యక్తి మానసిక పరిస్థితి సరిగాలేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. నిందితుడు క్వీన్స్‌లాండ్‌కు చెందిన జోయెల్ కౌచీ (40) గా గుర్తించారు. నిందితుడికి అంతుబట్టని మానసిక సమస్య ఉందని, ఆ సమస్యతోనే అతను అంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని వెల్లడించారు.
ముందుగా అనుమానించినట్లుగా ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రవాదుల హస్తం లేదని పోలీసులు తెలిపారు. కాగా సిడ్నీ నగరంలోని వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ మాల్లో శనివారం మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో ఓ దుండగుడు కత్తితో దాడిచేసి ఆరుగురిని హతమార్చాడు. ఈ ఘటనలో మరో 12 మంది క్షతగాత్రులయ్యారు. అనంతరం ఓ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.