పారిస్, నవంబర్ 11: మహిళ చేతిపై ముక్కును పెంచి, దాన్ని ముఖానికి అతికించి చరిత్ర సృష్టించారు ఫ్రాన్స్ సర్జన్లు. నాజల్ కావిటీ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఓ మహిళ ముక్కును కోల్పోయింది. దీంతో టౌలూజ్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు 3డీ-ప్రింటెడ్ బయో మెటీరియల్‌తో చేతిపై ముక్కును పెంచారు. రెండు నెలల తర్వాత దాన్ని కట్ చేసి, ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మైక్రో సర్జరీ ద్వారా.. ముఖం వద్ద ఉండే రక్తనాళాలను ఒక్కోదాన్ని 3డీ ముక్కు రక్తనాళాలతో కలుపుతూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు.