Sudoku: సుడోకో గేమ్ సృష్టికర్త మాకి కాజి కన్నుమూత

టోక్యో: పాపులర్ పజిల్ గేమ్ సుడోకో ( Sudoku ) ను సృష్టించిన మాకి కాజి కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. బైల్ డక్ట్ క్యాన్సర్‌తో ఆయన మరణించారు. మాకి కాజిని గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకోగా పిలుస్తారు. చిన్నపిల్లల కోసం నెంబర్స్‌తో పజిల్‌ను తయారు చేశారాయన. సుడోకో ఆటలో 1 నుంచి 9 మధ్య నెంబర్లను.. అడ్డం, నిలువుగా.. రిపీట్‌కాకుండా ప్లేస్ చేస్తారు. 2004 సంవత్సరంలో సుడోకో గేమ్ సూపర్‌హిట్ అయ్యింది. నిఖోలిని కంపెనీనికి కాజి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన తుది ప్రాణాలు విడిచారు. తన పజిల్స్ గురించి ప్రచారం చేసేందుకు కాజి సుమారు 30 దేశాల్లో పర్యటించారు. వంద దేశాల్లో 20 కోట్ల మంది సుడోకో చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. కాజికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యుల మధ్యే అంత్యక్రియలను పూర్తి చేశారు. నిఖోలి కంపెనీ సిబ్బంది కోసం నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Maki Kaji
- number puzzle
- Sudoko
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

