Sudan clashes | సూడాన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు.. 50 మందికిపైగా మృతి దుర్మరణం
ఆఫ్రికా దేశంలో సూడాన్ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ (Paramilitary) బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని ఖార్టూమ్ (Khartoum), దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 50 మందికిపైగా సాధారణ పౌరులు (Civilians) ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశంలో సూడాన్ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ (Paramilitary) బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని ఖార్టూమ్ (Khartoum), దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 50 మందికిపైగా సాధారణ పౌరులు (Civilians) ప్రాణాలు కోల్పోయారు. మరో 183 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సూడాన్ సెంట్రల్ మెడికల్ కమిటీ తెలిపింది. బాధితులు సెంట్రల్ ఖార్టూమ్ దవాఖానలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నది. వారిలో సాధారణ పౌరులతోపాటు మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించింది.
పారా మిలిటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన దేశంలో అగ్నికి ఆజ్యంపోసింది. ఇది ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న విభేదాలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

