Fine For Sandwich | శాండ్విచ్ కొన్నందుకు రూ.1.43 లక్షల ఫైన్.. అసలేమైందంటే?!
Fine For Sandwich | ఆస్ట్రేలియా మోడల్ జెస్సికా లీ చేసిన పొరపాటుకు ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు రూ.1.43 లక్షల ఫైన్ విధించారు.
Fine For Sandwich | రైళ్లు, కార్లు, పడవలు, విమానాల్లో సుదూర ప్రయాణం చేసేవారు ఆకలితో ఉంటారు. వారు తినడానికి, వెంట తీసుకెళ్లడానికి తేలిగ్గా ఉండే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తయారు చేసే డొమినోస్ లేదా సబ్వే శాండ్విచ్ తమ లగేజీలో తీసుకెళతారు. కానీ అలా తీసుకెళ్లిన శాండ్విచ్ వల్ల అక్షరాల రూ.1.43 లక్షల పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది. అవును ఇది నిజమే.. ఆస్ట్రేలియన్ మోడల్ జెస్సికా లీ.. తన లగేజీలో శాండ్విచ్ తీసుకెళ్తున్న సంగతి తెలియజేయనందుకు ఆస్ట్రేలియాలోని ఓ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు జెస్సికా లీకి 2664 డాలర్ల ఫైన్ వేశారు. అది 28 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
19 ఏండ్ల ఈ జెస్సికా లీ.. దీనిపై సోషల్ మీడియాలో చేసిన వీడియో వైరలైంది. వేల మంది వీక్షకులు చూశారు. యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తున్నారు జెస్సికా లీ.. ఆమె ప్రయాణం సుదీర్ఘంగా 11 గంటల పాటు సాగుతుంది. ఈ నేపథ్యంలో తన ఆకలిని తీర్చుకునేందుకు సింగపూర్ విమానాశ్రయంలో హాల్ట్ అయినప్పుడు సదరు శాండ్విచ్ కొనుక్కొన్నారు. విమానాశ్రయంలో సగం శాండ్విచ్ తిన్న జెస్సికా లీ.. మిగతా మొత్తం విమాన ప్రయాణంలో తినాలని అట్టి పెట్టుకున్నారు. కానీ, ఆ శాండ్విచ్ పూర్తిగా తినేయలేదు. ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు సదరు శాండ్ విచ్ గురించి రిపోర్ట్ చేయడం మరిచిపోయారు. ఫలితంగా కస్టమ్స్ అధికారులు ఆమెకు 2664 డాలర్ల ఫైన్ వేశారు. ఇది తన తప్పేనని, ఫైన్ చెల్లిస్తానని చెబుతూ వీడియో ముగించారు జెస్సికా లీ.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

