నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతం

న్యూయార్క్: నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. అన్ని రకాల వేరియంట్లపై తమ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ కంపెనీ పేర్కొన్నది. అమెరికా, మెక్సికోలో జరిగిన భారీ స్థాయి అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు నోవావాక్స్ పేర్కొన్నది. ప్రాథమిక డేటా ఆధారంగా వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతమైందని, సురక్షితంగా కూడా ఉన్నట్లు నోవావాక్స్ చెప్పింది. నిజానికి అమెరికాలో కోవిడ్ టీకాలకు డిమాండ్ తగ్గింది. కానీ ప్రపంచ దేశాల్లో ఆ టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. నోవావాక్స్ టీకాలను సులువుగా నిల్వ చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ సరఫరా డిమాండ్‌ను అందుకోవడంలో నోవావాక్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆ కంపెనీ చెప్పింది. సెప్టెంబర్ చివరినాటికి అమెరికా, యూరోప్, ఇతర దేశాల్లోనూ తమ టీకాలకు అనుమతి దక్కనున్నట్లు నోవావాక్స్ తెలిపింది. నెలకు 10 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఆ కంపెనీకి ఉన్నది. దిగువ, మధ్య తరగతి దేశాలకు తొలుత తమ టీకాలు వెళ్తాయని నోవావాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లే ఎర్క్ తెలిపారు. 18 ఏళ్లు దాటిన సుమారు 30 వేల మందిపై నోవావాక్స్ టీకా ట్రయల్స్ జరిగాయి. వీటిల్లో మూడవ వంతు ప్రజలు మూడు వారాల వ్యవధిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. యూకే వేరియంట్‌పై నోవావాక్స్ పనిచేస్తుందని తేలింది. సాధారణ ఫ్రిడ్జ్‌లో ఈ టీకాలను నిల్వ చేయవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

