Student Visas | అమెరికాలో విద్యార్థి వీసాలకు కత్తెర.. ఒక్క ఏడాదిలో 41 శాతం దరఖాస్తుల తిరస్కరణ
Student Visas | విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని చాలామంది ఆశిస్తుంటారు. అందులోనూ అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అందుకే వివిధ దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు.
Student Visas : విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని చాలామంది ఆశిస్తుంటారు. అందులోనూ అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అందుకే వివిధ దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ విద్యార్థి వీసాల (F-1 visas) సంఖ్యకు అమెరికా (USA) భారీగా కత్తెర వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) లో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఆమెరికా తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఈ F-1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయ్యింది.
అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్-1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.79 లక్షల (దాదాపు 41 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల (36 శాతం) దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలుపలేదు. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా.. 1.73 లక్షల (23 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అప్పటితో పోలిస్తే గత ఏడాది తిరస్కరణకు గురైన దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది.
అయితే తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలను అమెరికా దేశాలవారీగా వెల్లడించలేదు. గత ఏడాది డిసెంబర్ 9 వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు 38 శాతం తగ్గాయి. కొవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది.
ఎఫ్-1 వీసా అంటే..?
ఎఫ్-1 వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైమ్ విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతినిస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు – డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా చేరుతుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

