Turkey | టర్కీలో తుఫాను బీభత్సం.. గాలిలో చక్కర్లు కొట్టిన సోఫా.. వీడియో
తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి..
అంకారా: ప్రకృతి ఎంత బలీయమైనదో ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు ఊర్లకు ఊర్లనే తుడిచిపెట్టేస్తాయి. అలాగే ఈదురు గాలులకు భారీ వృక్షాలే నేలమట్టమవడం చూస్తూనే ఉంటాం. ఇక తేలికైన వస్తువులైతే అమాంతం గాలిలో కొట్టుకుపోవడం సహజంగా జరుగుతుంది. అయితే ఓ చిత్తు కాగితంలా గాలిలో ఎగురుకుంటూ వెళ్లిన సోఫాను (Sofa) ఎప్పుడైనా చూశారా…
తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి.. టర్కీలో (Turkey). ఫిబ్రవరిలో భూకంపంతో విలవిళ్లాడిన టర్కీ ఇప్పుడు భారీ వర్షాలు, ఈదురుగాలులతో వణికిపోతున్నది. దేశ రాజధాని అంకారాలో (Ankara) ఈదురు గాలుల ధాటికి ఏకంగా సోఫాను కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నది. సోఫా గాలిలో ఎగురుకుంటూ వస్తున్న వీడియో ఫుటేజీని గురు ఆఫ్ నథింగ్ (Guru of Nothing) అనే ఖాతాదారుడు ట్విట్టర్లో పోస్టు చేశాడు. అంకారాలో కురిసిన తుఫాను వల్ల పలు సోఫాలు గాలిలో ఎగిరిపోతున్నాయంటూ రాసుకొచ్చాడు.
https://twitter.com/GuruOfNothing69/status/1658932091197833217?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1658932091197833217%7Ctwgr%5E9f123f03ac1331d58f753973d0c72a65812784d1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Fwatch-violent-storm-causes-sofa-to-fly-in-sky-in-turkeys-ankara-4046599
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Ankara
- Guru of Nothing
- Sofa
- storm
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

