బొమ్మ డ్రోన్‌తో యుద్ధట్యాంకులను నిలువరించాడు!
- ఉక్రెయిన్‌లో హీరోగా మారిన 15 ఏండ్ల బాలుడు
కీవ్, జూన్ 13: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల చొరబాటును అడ్డుకునేందుకు సాధారణ పౌరులు సైతం ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఘటనలు ఉన్నాయి. యుద్ధ ట్యాంకులకు ఎదురుగా వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇదేవిధంగా కీవ్ శివారు ప్రాంతానికి చెందిన ఆండ్రీ పోక్రాసా అనే 15 ఏండ్ల బాలుడు దేశం కోసం హీరోయిజం ప్రదర్శించాడు. తండ్రి సాయంతో తన వద్ద ఉండే చిన్న బొమ్మ డ్రోన్ సాయంతో నగరం వైపు దూసుకొస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఫొటోలు, అవి ఉన్న లోకేషన్ల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి అందించేవాడు. తామిచ్చిన సమాచారం 20 రష్యా ట్యాంకులను ధ్వంసం చేయడంలో ఉక్రెయిన్ సైన్యానికి సహకరించిందని ఆండ్రీ చెబుతున్నాడు.
40 వేల మంది సైనికులను కోల్పోనున్న రష్యా
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల చివరికి మొత్తం 40 వేల మంది సైనికులను రష్యా కోల్పోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘డాన్‌బాస్‌లో రష్యా ఆర్మీ బలగాలను మోహరించాలని ప్రయత్నిస్తున్నది. ఏ బలగాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు? యుద్ధంలోకి శిక్షణ సరిగ్గా పొందని వారిని పంపిస్తున్నది. దొంగ దారిన నియమించిన వారిని కూడా పంపుతున్నది. కేవలం మా బలగాల కన్నా ఎక్కువ మంది ఉండాలనే ఉద్దేశంతోనే వారిని పంపుతున్నది. అంతేకానీ వారికి ఎలాంటి యుద్ధ ప్రావీణ్యం లేదు’ అని వివరించారు. ఉక్రెయిన్ భద్రతా బలగాలు తమ దేశంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

