Study | స్పుత్నిక్ టీకాతో ఒమిక్రాన్ నుంచి రక్షణ
Sputnik V Vaccine | ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మెరుగైన రక్షణ అందిస్తున్నట్లు తేలింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్ కంటే ఎక్కువగా స్పుత్నిక్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు

మాస్కో : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుంచి స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ మెరుగైన రక్షణ అందిస్తున్నట్లు తేలింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ (Pfizer) వ్యాక్సిన్ కంటే ఎక్కువగా స్పుత్నిక్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. రష్యన్, ఇటాలియన్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించగా.. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నిధులు సమకూర్చింది. అధ్యయనంలో వివిధ వ్యాక్సిన్లను పొందిన వ్యక్తుల రక్త సీరమ్‌ను శాస్త్రవేత్తలు పోల్చిచూశారు.
ఇటలీలోని స్పల్లంజాని ఇన్స్టిట్యూట్, స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయా ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తల బృందం అధ్యయనం జరిపింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడు నెలల నుంచి ఆరు నెలల తర్వాత నమూనాలు స్పుత్నిక్-వీ నమూనాలు స్పుత్నిక్ వీ.. రెండు డోసుల తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఫైజర్ టీకాలు వేసిన వారి కంటే ఒమిక్రాన్ నుంచి ఎక్కువ రక్షణ ఇస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
స్పుత్నిక్ వీ టీకా తీసుకున్న 51 మంది, ఫైజర్ టీకా తీసుకున్న 17 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఇంకా అధ్యయాన్ని ధ్రువీకరించాల్సి ఉన్నది. స్పుత్నిక్ టీకాలు తీసుకున్న వారి రక్తం సీరంలో 74.2శాతం, ఫైజర్ బయో ఎన్‌టెక్ టీకా తీసుకున్న వారిలో 56.9శాతం మందిలో ఒమిక్రాన్‌ను నిర్మూలించే యాంటీబాడీలున్నట్లు గుర్తించారు. ఇంతకు ముందు స్పుత్నిక్ వీ టీకాను తయారు చేసిన గమలేయా ఇన్స్టిట్యూట్ స్పుత్నిక్ వీ లైట్ బూస్టర్ డోస్.. రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కంటే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా బలమైన రక్షణ చూపిందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

