కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్న స్పుత్నిక్ వ్యాక్సిన్!

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెల్టా సహా కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించాయి. ఆల్ఫా బీ.1.1.7 (తొలిసారి యూకేలో కనిపించింది), బీటా బీ.1.351 (తొలిసారి సౌతాఫ్రికాలో కనిపించింది), గామా పీ.1 (బ్రెజిల్లో కనిపించింది), డెల్టా బీ.1.617.2, బీ.1.617.3 (ఇండియాలో కనిపించింది) వేరియంట్లను అడ్డుకునే టైటర్లను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినట్లు గమలేయా ఇన్‌స్టిట్యూల్ వెల్లడించింది.
నేరుగా వైరస్‌నే ఉపయోగించి చేసిన వైరస్ న్యూట్రలైజింగ్ యాక్టివిటీ (వీఎన్ఏ)ని అంచనా వేసి ఈ అధ్యయనం జరిగినట్లు తెలిపింది. కరోనా తొలి వేరియంట్ అయిన బీ.1.1.1 సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కనిపించిన వేరియంట్లను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రేరిత సేరా ఎలా అడ్డుకుంటుందో పరిశీలించారు. అంతేకాదు ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో కలిసి వ్యాక్సిన్ కాక్టెయిల్స్ను తయారు చేసే దిశగా గమలేయా, ఆర్డీఐఎఫ్ అధ్యయనం నిర్వహిస్తోంది. ఇండియా సహా ప్రపంచంలోని మొత్తం 67 దేశాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిజిస్టర్ అయింది. ఇండియాలో ఈ మధ్యే ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

