NASA | కొత్త ప్లేస్‌లోకి వ్యోమగాములు.. ఫిబ్రవరిలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్..!
NASA | భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్‌తో సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమిపైకి చేరుకోనున్నారని అంచనా.
NASA | భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్‌తో సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమిపైకి చేరుకోనున్నారని అంచనా. స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌షిప్ భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5.05 గంటలకు ఐఎస్ఎస్ హార్మోనీ మాడ్యూల్ ముందు పోర్ట్ నుంచి అన్‌డాక్ అయ్యింది. ఆటోమేటిక్‌గా మాడ్యూల్ స్పేస్ ఫేసింగ్ పోర్ట్‌కి చేరుతుంది.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్‌లో ఐఎస్ఎస్కి వెళ్లారు. ఆ తర్వాత స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరి భూమికిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇందు కోసం స్పేస్ ఎక్స్‌కు చెందిన కార్గో వెర్షన్‌ని ప్రయోగించింది. స్పేస్ఎక్స్ నాసా 31వ కమర్షియల్ రీసప్లై సర్వీసెస్ మిషన్‌గా పిలుస్తారు. ఈ రీసప్లై సర్వీసెస్ మిషన్ కింద సౌర గాలి, రేడియేషన్, స్పేస్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, అంతరిక్షంలో కోల్డ్ వెల్డింగ్పై పరిశోధనలు చేయబోతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Astronauts
- february
- ISS
- SpaceX
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

