సియోల్, డిసెంబర్ 31: భవిష్యత్తు విద్యుత్తు కష్టాలను పరిష్కరించడంలో భాగంగా దక్షిణ కొరియా ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. కృత్రిమ సూర్యుడి సాయంతో 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను 300 సెకండ్లపాటు సృష్టించనున్నది. ‘కేస్టార్’ పేరిట 2026నాటికి చేపట్టబోయే ఈ ప్రయోగ వివరాలను గురువారం జరిగిన 16వ నేషనల్ ఫ్యూజన్ కమిటీ సమావేశంలో అధికారులు వెల్లడించారు. అణువిచ్ఛేదన సాంకేతికత సాయంతో వాణిజ్య అవసరాల కోసం విద్యుత్తును పెద్దమొత్తంలో సృష్టించాలంటే 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కనీసం 300 సెకండ్లపాటు కొనసాగేలా చేయాలి. ఇందులోభాగంగా 2018లో తొలిసారిగా కొరియా అధికారులు కృత్రిమ సూర్యుడి సాయంతో 1.5 సెకండ్లపాటు 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను సృష్టించారు. 2020లో దీన్ని 20 సెకండ్లకు పెంచారు.