సియోల్: కుక్క మాంసానికి ఇక స్వస్తి పలకాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిషేధాన్ని ప్రకటించాలని ప్రణాళిక వేస్తున్నది. దేశంలో లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న కుక్క మాంసాన్ని ఇంత హఠాత్తుగా నిషేధించడానికి కుక్క మాంసంపై అంతర్జాతీయ సమాజం నుంచి,
జంతు ప్రేమికుల నుంచి విమర్శలు రావడం, కుక్క మాంసం తినడంపై యువత అనాసక్తి చూపడమే కారణం. కుక్క మాంసంపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయాలు చూపిన తర్వాతే నిషేధాన్ని మూడేండ్ల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.