జొహన్నెస్‌బర్గ్: పైలట్లకు ఆకాశంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ దక్షిణాఫ్రికా పైలట్ రుడోల్ఫ్ ఎరస్మస్కు మాత్రం కలలో కూడా ఊహించని సవాల్ ఎదురైంది. ఈ నెల 3న విమానం ఆకాశంలోకి ఎగిరిన తర్వాత తన సీటు కింద కోబ్రా ఉన్నట్టు అతడు గమనించాడు. అంతే.. ఒక్కసారి నిశ్చేష్టుడయ్యాడు. ఈ విషయం ప్రయాణికులకు చెప్పాలా వద్దా అని ఆలోచించాడు. చివరికి సమయస్ఫూర్తి ప్రదర్శించి విమానంలో పాముందని, బహుశా అది తన సీట్ కిందే ఉండొచ్చని, ఇందువల్ల వీలైనంత త్వరగా విమానాన్ని కిందకు దింపుతానని ప్రకటించారు. అనంతరం కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వడంతో జోహన్నెస్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.