ఉక్రెయిన్ ఆధీనంలోకి స్నేక్ ఐల్యాండ్
మాస్కో: వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐల్యాండ్ నుంచి తమ దళాలను ఉపసంహరించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆరంభంలో ఈ ద్వీపం కీలకంగా నిలిచింది. ఉక్రెయన్ దళాలు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించాయి. రష్యా దళాలు ఆ ఐల్యాండ్ నుంచి వెనక్కి వెళ్లినట్లు ఉక్రెయిన్ చెప్పింది. నల్ల సముద్రంలో ఉన్న స్నేక్ ఐల్యాండ్ .. రష్యా, ఉక్రెయిన్ వార్‌లో కీలకంగా మారింది. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నది. ఈ దీవిని ఆక్రమించినవారు ఒకవేళ అక్కడ లాంగ్ రేంజ్ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాట్లు చేస్తే అప్పుడు వాళ్లకు ఈ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినట్లు అవుతుంది. అయితే రష్యాకు ఆ అవకాశం ఉన్నా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది.
గతంలో రొమేనియా ఆధీనంలో ఉన్న స్నేక్ ఐలాండ్‌ను సోవియేట్ యూనియన్ సమయంలో రేడార్ బేస్‌గా వాడారు. స్నేక్ ఐల్యాండ్ నుంచి దళాలను ఉపసంహరించడం అంటే తాము ఆహార ఎగుమతుల్ని అడ్డుకోవడంలేదని స్పష్టం చేసినట్లు అవుతుందని రష్యా చెప్పింది. ఇదొకరకంగా ఉక్రెయిన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించేందుకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుతగలడం లేదని రష్యా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార సంక్షోభానికి తామే కారణమని చెప్పడానికి ఇప్పుడు ఉక్రెయిన్ వద్ద సమాధానం ఉండదని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ మాత్రం ఇంకా నల్ల సముద్రంలోని తీర ప్రాంతాన్ని క్లియర్ చేయడం లేదని రష్యా ఆరోపిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

