‘నాతో పడుకుంటావా.. లేకపోతే ఇంకో 20 మందిని తీసుకువచ్చి అందరం కలిసి రేప్ చేయమంటావా..’ 16 ఏండ్ల ఉక్రెయిన్ బాలికను రష్యా సైనికుడు బెదిరించి లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడిన తీరిది. ఉక్రెయిన్లో బాలికలు, మహిళలపై రష్యా సైనికులు సాగిస్తున్న అకృత్యాలకు సాక్ష్యమిది. తనపై రష్యా సైనికుడు ఎలా లైంగిక దాడికి పాల్పడింది స్వయంగా ఆ బాలిక వెల్లడించింది. తాను గర్భంతో ఉన్నానని తెలిపినా వదిలిపెట్టలేదని పేర్కొన్నది. అడ్డు చెప్పితే గొంతు నులిమాడని, చంపేస్తానని బెదిరించాడని చెప్పింది.