నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం ఒక్కసారిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. అమెరికాలోని నెబ్రస్కా, మిన్నెసొటా, ఇల్లినాయిస్ రాష్ర్టాల్లో ఈ అరుదైన దృశ్యం ఇటీవల కనువిందు చేసింది. దీనికి కారణం.. డెరెకో అనే ధూళి తుఫాను.
మేఘాల్లో ఎక్కువ మోతాదులో ఉండే నీటి బిందువులు.. నీలిరంగు తరంగధైర్ఘ్యాన్ని పరిక్షేపణం చేస్తాయన్న విషయం తెలిసిందే. ఆ కిరణాలు.. డెరెకో ధూళి తుఫాను, పగటి సమయంలో ప్రసారమయ్యే ఎరుపు, పసుపు రంగు కాంతితో కలిసిపోవడంతో ఆకాశం ఇలా ఆకుపచ్చగా మారినట్టు నిపుణులు పేర్కొన్నారు.