Perry High School | హై స్కూల్లో కాల్పులు.. ఆరో తరగతి విద్యార్థి మృతి
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. లోవా స్టేట్‌లోని పెర్రీ హైస్కూల్లో (Perry High School) చొరబడిన ఓ టీనేజర్.. హాండ్గన్, షాట్గన్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. లోవా స్టేట్‌లోని పెర్రీ హైస్కూల్లో (Perry High School) చొరబడిన ఓ టీనేజర్.. హాండ్గన్, షాట్గన్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆరో తరగతి చదవుతున్న ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 7.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని చెప్పారు. విద్యార్థులు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా టీనేజర్ కాల్పులు జరిపాడని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ మిచ్ మోర్ట్వెడ్ వెల్లడించారు. గాయపడినవారిలో నలుగురు విద్యార్థులు ఉండగా, మరొకరు స్కూల్ అడ్మినిస్ట్రేటర్ అని తెలిపారు. ఈ శీతాకాల సెలవులు ముగిసిన తర్వాత మొదటిసారిగా స్కూల్ ఓపెన్ అయిందని, ఇంతలోనే కాల్పుల ఘటన చోటుచేసుకున్నదని వ్యాఖ్యానించారు.


Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

