చెంచాలతో సొరంగం తవ్వి జైలు నుంచి పారిపోయిన ఖైదీలు.. ఎప్పుడు? ఎక్కడ?

జెరుసలెం: అది ఇజ్రాయెల్‌లోనే అత్యంత భద్రత ఉండే జైలు. చీమ చిటుక్కుమన్నా అక్కడి అధికారులకు తెలిసిపోతుంది. అలాంటి జైలు నుంచి ఆరుగురు పాలస్తీనా ఖైదీలు పారిపోయారు. అది కూడా ఎలాగో తెలుసా? తమ దగ్గర ఉన్న తుప్పు పట్టిన చెంచాలతో ఓ సొరంగాన్ని తవ్వి.. అందులో నుంచి బయటపడ్డారు. ఇప్పుడా ఖైదీల కోసం ఇజ్రాయెల్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
అందరూ జిహాదీలే..
పారిపోయిన ఆరుగురు ఖైదీల్లో ఐదుగురు ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన వాళ్లు కాగా.. ఒకరు అల్-అక్సా మార్టిర్స్ బ్రిగేడ్ నాయకుడు. వీళ్లంతా గిల్బోవా జైల్లో ఒకే సెల్లో ఉండేవారు. అందులో ఉన్న ఓ సింక్‌ను ఆధారంగా చేసుకొని భారీ సొరంగం తవ్వి పారిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు. సాధారణంగా ఇజ్రాయెల్ జైలు నుంచి పాలస్తీనా ఖైదీలు పారిపోవడం అంత సులువు కాదు. అత్యంత అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెనెట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఎలా చేశారు?
జైలు గది డిజైన్‌లో ఉన్న లొసుగులను వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని ఈ సొరంగం తవ్వినట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ కమిషనర్ కేటీ పెర్రీ వెల్లడించారు. జైలు గోడల వెనుక ఉన్న ఖాళీ ప్రదేశం ఈ ఖైదీలకు ఉపయోగపడింది. వాళ్లు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఈ పని చేశారని, బయటి వాళ్ల సహకారం కూడా ఇందులో ఉండొచ్చని జైలు అధికారులు చెప్పారు. ఈ ఘటన తర్వాత జైల్లోని మిగతా 400 మంది ఖైదీలను మరో జైలుకు తరలించారు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు.. ఇప్పటికే పాలస్తీనీయులకు ఎంతో కొంత పట్టు ఉన్న జెనిన్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు.
ఓ చెంచాతో కొన్ని నెలల పాటు శ్రమించి వాళ్లు ఈ సొరంగం తవ్వినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఆ తుప్పు పట్టిన చెంచా ఎవరికీ కనిపించకుండా.. జైలు గదిలోని ఓ ఫొటో వెనుక దాచారు. పారిపోయిన వాళ్లలో నలుగురు ఖైదీలు జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

