Train-Bus crash | నైజీరియాలో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన రైలు.. ఆరుగురు దుర్మరణం
Train-Bus crash | నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. అనంతరం బస్సును ట్రాక్ వెంట కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
లాగోస్: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. అనంతరం బస్సును ట్రాక్ వెంట కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
నైజీరియా దేశం లాగోస్ నగరంలోని ఐకెజా ఏరియాలోగల రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 90 మంది ఉన్నారు. బస్సును రైలు డీకొట్టిన ఘటన తెలియగానే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న 90 మంది ప్రయాణికులను వెలికితీశారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

