అలబామా: అమెరికా దేశానికి చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత్రి లానా డెల్ రే (Lana Del Rey) ఇటీవల ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ కనిపించింది. వాఫిల్ హౌస్ రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తూ ఆమె తన అభిమానులను షాక్ గురిచేసింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో గల వాఫిల్ హౌస్ రెస్టారెంట్‌కు సంబంధించిన లోగోతో కూడిన యూనిఫామ్‌లో ఉన్న ఆమె.. కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ, వారికి కాఫీ తయారు చేసి ఇస్తూ కనిపించింది.
అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పీజియన్స్ అండ్ ప్లేన్స్’ అనే ఫేస్బుక్ పేజీలో ముందుగా కనిపించిన ఫొటోలు తర్వాత తర్వాత సోషల్ మీడియా అంతటా వ్యాపించాయి. అయితే, లానా డెల్ రేకు రెస్టారెంట్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.