Silvio Berlusconi: వాక్యూమ్ క్లీనర్లు అమ్మారు.. బుంగా బుంగా పార్టీల్లో తేలారు
Silvio Berlusconi: బెర్లుస్కోనీ చరిత్ర ప్రత్యేకమైంది. వాక్యూమ్ క్లీనర్లు అమ్ముకుంటూ ఆయన తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. మీడియా మొఘల్ అయ్యారు.. ఫుట్‌బాల్ క్లబ్‌కు ఓనర్ అయ్యారు.. నాలుగు సార్లు ప్రధాని అయ్యారు.. ప్రధానిగా బుంగా బుంగా పార్టీలు ఆర్గనైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయన దృష్టిని ఆకర్షించారు. ఇవాళ ఆయన కన్నుమూశారు.
మిలాన్: బిలియనీర్ వ్యాపారవేత్త, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ(Silvio Berlusconi) 1936లో మిలాన్‌లో పుట్టారు. వాక్యూమ్ క్లీనర్లు అమ్ముకుంటూ ఆయన తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఓ నిర్మాణ రంగ కంపెనీని స్థాపించారు. నాలుగు సార్లు ఇటలీ ప్రధాని అయిన బెర్లస్కోనీ .. ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇటలీ దేశ రాజకీయాల్లో బెర్లుస్కోనీలా ప్రభావంతమైన వ్యక్తి లేరు. వివాదాల్లోనూ ఆయన నెంబర్ వన్.
ఇటలీ సంపన్న వ్యక్తిగా కూడా ఆయన ఎదిగారు. టీవీ ఛానల్‌ను స్థాపించి తన సంపదను పెంచేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే ఆయన ఏసీ మిలాన్ ఫుట్‌బాల్ క్లబ్‌ను సొంతం చేసుకుని అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఫోర్జా ఇటాలియా పార్టీని ఆయన 1993లో ప్రారంభించారు. ఆ తర్వాత రెండు దశాబ్ధాల పాటు ఆయన శక్తివంతమైన నేతగా చెలామణి అయ్యారు. అవినీతి, సెక్స్ కుంభకోణాల్లో బెర్లస్కోనీకి ప్రత్యేక స్థానం ఉంది.
ఓ మీడియా మొఘల్‌గా, రాజకీయవేత్తగా.. ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్‌గా.. అంతర్జాతీయంగా ఇటలీకి ఖ్యాతిని తీసుకువచ్చారు. 86 ఏళ్ల వయసులో బెర్లస్కోనీ ఇవాళ కన్నుమూశారు. మీడియా టైకూన్‌గా కీర్తిగాంచిన ఆయన దాదాపు మూడు దశాబ్ధాల పాటు తన ముద్రను వేసుకున్నారు.
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో బెర్లుస్కోనీ జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన ఓ గ్రామంలో పెరిగారు. విద్యార్థి దశ నుంచి ఆయన డబ్బు సంపాదన మార్గాలపై దృష్టిపెట్టారు. ఓ యూనివర్సిటీలో లా చదువుతూనే .. స్టూడెంట్ బ్యాండ్‌లో మ్యూజిక్ ప్లేయర్‌గా చేశాడు. ఓ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్ క్లబ్బులు, క్రూయిజ్ షిప్స్‌లోనూ పనిచేశారు.
ఎడిల్నార్డ్ నిర్మాణ కంపెనీ ఏర్పాటు తర్వాత 1973లో లోకల్ కేబుల్ టీవీ కంపెనీని ఏర్పాటు చేశారు. టెలిమిలానో అనే పేరుతో ఆ ఛానల్ నడిపారు. మెల్లమెల్లగా స్టూడియోలను కొనేస్తూ చివరకు ఫిన్ ఇన్వెస్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. మీడియాసెట్ పేరుతో అతిపెద్ద మీడియా కంపెనీ పెట్టారు. మొండాదరి అనే పబ్లిషింగ్ హౌజ్‌ను కూడా నడిపించారు.
2011 చివర్లో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారైంది. పన్ను ఎగవేత కేసులో ఆయనపై వేటు వేశారు. బెర్లుస్కోనీకి అప్పటికే 75 ఏళ్లు కావడంతో ఆయన కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు. ప్రధానిగా పోటీ చేయరాదు అని కూడా ఆయనపై ఓ దశలో బ్యాన్ విధించారు.
అమ్మాయిలతో ఎంజాయ్ చేయడంలో బెర్లుస్కోనీ దిట్ట. తన విల్లాలో బుంగా బుంగా పార్టీలు ఇచ్చేవారు. ఆ పార్టీలకు షో గర్ల్స్ హాజరయ్యేవారు. అయితే శృంగారం కోసం ఓ మైనర్ వ్యభిచారిణికి డబ్బులు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బుంగా బుంగా పార్టీలకు వచ్చే ఓ 17 ఏళ్ల అమ్మాయి దొంగతనం కేసులో దొరికితే, ఆమెను వదిలిపెట్టాలని స్వయంగా బెర్లుస్కోనీ పోలీసులకు ఫోన్ చేశారు. తప్పు చేయలేదని చెప్పుకునే బెర్లుస్కోనీ.. తానేమీ సాధువును కాదంటూ పలుమార్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

