Smoking: వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే స్మోకింగ్ చేయొద్దు.. ఓ కంపెనీ ఆదేశాలు
పని చేస్తున్న సమయంలో చాయ్లని, సిగరెట్ల( Smoking )ని వెళ్లకూడదని కంపెనీలు ఆదేశించడం సహజమే. ఆఫీస్‌లో ఓ ఉద్యోగి ఉన్నంత సమయం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నది ఈ ఆదేశాల ఉద్దేశం.

టోక్యో: పని చేస్తున్న సమయంలో చాయ్లని, సిగరెట్ల( Smoking )ని వెళ్లకూడదని కంపెనీలు ఆదేశించడం సహజమే. ఆఫీస్‌లో ఓ ఉద్యోగి ఉన్నంత సమయం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నది ఈ ఆదేశాల ఉద్దేశం. అయితే జపాన్‌లోని నొమురా హోల్డింగ్స్ అనే సంస్థ.. మీరు వర్క్ ఫ్రమ్ చేస్తున్నా సరే పని చేస్తున్న సమయంలో స్మోకింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని తమ ఉద్యోగులందరికీ మెసేజ్ పంపించింది. డిసెంబర్‌లోగా ఆ సంస్థ నిర్వహిస్తున్న అన్ని స్మోకింగ్ రూమ్‌లను కూడా మూసివేయాలని నొమురా హోల్డింగ్స్ నిర్ణయించింది.
మరి ఇంట్లో ఓ ఉద్యోగి స్మోక్ చేస్తున్నాడా లేదా అని ఎలా చూస్తారన్న సందేహం కలగడం సహజం. దీనికోసం ప్రత్యేకంగా తామేమీ ఉద్యోగిపై నిఘా ఉంచబోమని, వాళ్లపై తమకు నమ్మకం ఉందని ఆ సంస్థ చెబుతోంది. పని వాతావరణాన్ని మెరుగుపరచి, స్మోక్ చేస్తున్న వాళ్ల వల్ల మిగతా వాళ్లపై ఆరోగ్యాలపై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి ఆరోగ్యంతో ఓ ఉద్యోగి తన పూర్తి సామర్థ్యం మేరకు సేవలందించాలని సంస్థ భావిస్తున్నట్లు ఒక ప్రకటనలో చెప్పింది.
స్మోకింగ్ పెరగడం వల్లే..
చాలా మంది ఉద్యోగులు ఆఫీస్‌లకు వచ్చినప్పుడు సిగరెట్లు తాగుతారు. అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటి నుంచీ ఈ స్మోకింగ్ అలవాటు మరింతగా పెరిగినట్లు ప్రతి 10 మంది స్మోకర్లలో ఇద్దరు చెప్పారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఇంట్లో స్మోకింగ్ పరిమితులేమీ ఉండకపోవడం వల్ల ఇది పెరిగిపోతోందని నేషనల్ క్యాన్సర్ సెంటర్ జపాన్ చెప్పింది. దీంతో నొమురాలాంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఇలా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తమ ఉద్యోగుల్లో 2020 మార్చి నాటికి 20 శాతం మంది స్మోకర్లు ఉండగా.. 2025 నాటికి దానిని 12 శాతానికి తగ్గించాలని నొమురా లక్ష్యంగా పెట్టుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

