Foreign Education | విదేశీ విద్యపై తగ్గుతున్న మోజు!.. యూఎస్, యూకే, కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం
విదేశాలకు వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేండ్లలో మొదటిసారి తగ్గుముఖం పట్టింది. భారతీయ విద్యార్థుల్లో అధికభాగం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ దేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Foreign Education | న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 : విదేశాలకు వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేండ్లలో మొదటిసారి తగ్గుముఖం పట్టింది. భారతీయ విద్యార్థుల్లో అధికభాగం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ దేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో ఈ మూడు దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాల్లో 25 శాతం తగ్గుముఖం పట్టింది. అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34 శాతం, బ్రిటన్‌కు వెళ్లే వారి సంఖ్య 26 శాతం, కెనడాకు వెళ్లేవారి సంఖ్య 32 శాతం తగ్గింది. కెనడాకు వెళ్లేవారి సంఖ్య 2.78 లక్షల నుంచి 1.89 లక్షలకు తగ్గినట్టు ఇమిగ్రేషన్ వర్గాలు తెలిపాయి.
విద్యార్థులకు అమెరికా ఇచ్చే ఎఫ్-1 వీసాల సంఖ్య 1,31,000 నుంచి 86,110కి తగ్గింది. ఆయా దేశాల్లో వలస నిబంధనలు కఠనతరం కావడం వల్లనే ఈ మార్పు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోవైపు కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం ఈ పరిస్థితికి తోడైంది. గృహ, ఆరోగ్య, ఇతర సేవలు భారంగా మారుతున్నాయన్న సాకుతో 2026 నాటికి విదేశీ విద్యార్థుల సంఖ్యను ఐదు శాతం తగ్గించాలని కెనడా నిర్ణయించింది. బ్రిటన్ కూడా విదేశీ విద్యార్థులు తమపై ఆధారపడే వారిని (డిపెండెంట్స్‌ను) తీసుకురాకుండా నిబంధనలు విధించింది. దీంతో ఆ దేశానికి కూడా వీసాకు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య తగ్గింది. నిజానికి గత పదేండ్లలో ఈ మూడు దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. 2022, 23లో భారతీయులు చైనాను దాటేశారు కానీ 2024లో మళ్లీ తగ్గిపోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

