డైనోసార్లు అంతరించిపోయినా షార్క్‌లు బతికాయి

స్టాక్‌హోమ్, ఆగస్టు 15: కొండలాంటి భారీ ఆకారం, భీకరమైన అరుపులతో ఆరున్నర కోట్ల ఏండ్లక్రితం భూమండలంపై ఏకఛత్రాధిపత్యం వహించిన డైనోసార్లు ఆస్టరాయిడ్ల కారణంగా అంతరించిపోయాయన్న విషయం తెలిసిందే. అయితే, అవే గ్రహశకలాలు షార్క్ చేపలను ఏమీ చేయలేకపోయాయని, అందుకే ఆ జీవ జాతి ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నదని స్వీడన్‌కు చెందిన ఉప్సాలా యూనివర్సిటీ పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఓ పెద్ద నగరం సైజు ఉన్న ఆస్టరాయిడ్ ఒకటి గల్ఫ్ ఆఫ్ మెక్సికోను వేగంగా వచ్చి ఢీకొట్టిందని, దీంతో డైనోసార్లతో కలిపి భూమి, సముద్రం, నదుల్లో ఉన్న సమస్త జీవజాలం అంతరించిపోయిందని పరిశోధకులు చెబుతారు. అయితే, ఇదే సమయంలో జీవించిన కొన్ని షార్క్ జాతులు అనూహ్యంగా బతికిపోయినట్టు వెల్లడించారు. 8.3 కోట్ల నుంచి 5.6 కోట్ల ఏండ్ల క్రితం జీవించిన 1,239 షార్క్ శిలాజాల దంతాలను పరిశోధించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. ఇందులో ఎనిమిది షార్క్ జాతులు ఇప్పటికీ మనుగడలో ఉన్నట్టు వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

