రేపిస్టుకు వెయ్యేండ్లకు పైగా జైలుశిక్ష..!
1000 years imprisonment: నేరం తీవ్రతను బట్టి దోషికి ఏకంగా వెయ్యేండ్లకు పైగా జైలు శిక్ష విధించింది.

న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం తీవ్రతను బట్టి దోషికి ఏకంగా వెయ్యేండ్లకు పైగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి 2014-19 మధ్య ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలతోపాటు మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడేవాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్లలో చోరీలకు పాల్పడటంతోపాటు 41 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

