Sebastian Pinera: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయాన్ని సెబాస్టియన్ కార్యాలయం ప్రతినిధులు ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఆయన హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా అది కూలిపోయింది.
ఈ ప్రమాదంలో పినేరా మృతిచెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా.. మొదటిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశాధ్యక్షుడిగా పనిచేశారు.
బిలియనీర్ అయిన సెబాస్టియన్ పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన మృతిపట్ల దక్షిణ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు సంతాపం వ్యక్తంచేశారు.