వాషింగ్టన్, జూలై 28: ఏలియన్స్ ఉనికిని తెలుసుకోవడానికి అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకుల బృందం ‘గెలీలియో ప్రాజెక్ట్’ పేరిట కొత్త మిషన్‌ను ప్రారంభించింది. టెలిస్కోప్‌లు, కృత్రిమమేధ (ఏఐ) సాయంతో ఈ పరిశోధన చేపట్టనున్నారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? మనలాగే వారుకూడా సాంకేతిక రంగంలో పురోగతి సాధించారా? తదితర అంశాలను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పరిశోధించనున్నారు.