వావ్.. విస్కీ వ్యర్థాలతో బయోగ్యాస్ సృష్టించి.. వాటితోనే ట్రక్కులు నడిపించి..

డఫ్టౌన్, స్కాట్లాండ్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్కాచ్ విస్కీ తయారీదారు గ్లెన్‌ఫెడిచ్.. ఓ వినూత్నమైన బయోగ్యాస్‌ను తయారు చేస్తోంది. దీనికోసం తాను విస్కీ తయారు చేయగా మిగిలిపోయిన వ్యర్థాలనే ఉపయోగిస్తోంది. ఇలా తయారు చేసిన బయోగ్యాస్‌ను తన విస్కీ డెలివరీ చేసే ట్రక్కుల కోసమే ఉపయోగిస్తుండటం మరో విశేషం. పైగా ఈ బయోగ్యాస్ 95 శాతం మేర కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తోంది.
ఎలా వచ్చిందీ ఆలోచన?
స్కాట్లాండ్లోని డఫ్టౌన్ డిస్టిలరీలో ఇప్పటికే గ్లెన్‌ఫిడిచ్ ప్రత్యేకంగా ఓ ఫ్యుయెల్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ స్కాచ్ విస్కీ మాతృసంస్థ అయిన విలియం గ్రాంట్ అండ్ సన్స్ తయారు చేసిన కొత్త టెక్నాలజీని ఉపయోగించి విస్కీ వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేస్తోంది. ఈ ఇంధనం అల్ట్రా లో కార్బన్ ఫ్యుయెల్ (యూఎల్సీఎఫ్). అంటే చాలా తక్కువ స్థాయిలో సీఓ2ను విడుదల చేస్తుంది.
నిజానికి గ్లెన్‌ఫిడిచ్ విస్కీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన ధాన్యం వ్యర్థాలను పశువుల కోసం హైప్రొటీన్ దాణాగా ఉపయోగించేది. అయితే ఈ ద్రవ వ్యర్థాలతో ఇంధనాన్ని కూడా తయారు చేయవచ్చని భావించిన సంస్థ.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్లెన్‌ఫిడిచ్ ప్రతి ఏటా కోటి 40 లక్షల బాటిళ్ల సింగిల్ మాల్ట్ విస్కీని అమ్ముతోంది. ఆ విస్కీ బాటిళ్లను తయారు చేయగా భారీ వ్యర్థాలు మిగిలిపోతున్నాయి. వాటి నుంచే ఇప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తి చేసి.. తన డెలివరీ ట్రక్కుల్లో వినియోగిస్తోంది.
పర్యావరణానికీ మేలు
డీజిల్, పెట్రోల్‌లాంటి శిలాజ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల కంటే ఈ బయోగ్యాస్ ఉపయోగించే వాహనాలు సీఓ2 ఉద్గారాలను 95 శాతం తగ్గిస్తోంది. ఇక హానికారక కణాలతోపాటు గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను కూడా 99 శాతం మేర తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి ట్రక్కు ఏటా 250 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తోందని ఈ సందర్భంగా గ్లెన్‌ఫిడిచ్ చెప్పింది.
అందుకే తమ వంతుగా పర్యావరణానికి హాని చేయని విధంగా తమ ట్రక్కులను ఇలా బయోగ్యాస్ ద్వారా నడిపిస్తున్నట్లు తెలిపింది. ఈ గ్యాస్‌తో నడిచేలా తమ కంపెనీ ట్రక్కులకు గ్లెన్‌ఫిడిచ్ మార్పులు, చేర్పులు చేయడం విశేషం. ప్రస్తుతం 3 ట్రక్కులు నడుస్తుండగా.. తమ దగ్గర ఉన్న మొత్తం 20 ట్రక్కులను ఇలాగే మార్చనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

