(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సహజసిద్ధంగా వజ్రం ఏర్పడాలంటే వందల ఏండ్ల సమయం కావాలి. ప్రయోగశాల్లో కృత్రిమ వజ్రాన్ని తయారు చేయాలంటే కనీసం రెండు వారాల సమయం అవసరం.
అయితే, దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేసిక్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్త రాడ్నే రూఫ్ కేవలం 15 నిమిషాల్లోనే వజ్రాన్ని తయారు చేయగలిగే సాంకేతికతను అభివృద్ధి చేశారు. గాలియమ్-నికెల్-ఐరన్ మిశ్రమానికి సిలికాన్, కార్బన్‌ను కలిపి ఈ వజ్రాన్ని తయారు చేసినట్టు రూఫ్ పేర్కొన్నారు.