Watch: పర్యాటకులతో ఉన్న సఫారీ వాహనాన్ని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాత ఏం జరిగిందంటే?
Elephant Lifts safari Truck | పర్యాటకులు ఉన్న సఫారీ వాహనాన్ని ఒక ఏనుగు పలుమార్లు ఎత్తి పడేసింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే ఆ ఏనుగు పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కేప్ టౌన్: పర్యాటకులు ఉన్న సఫారీ వాహనాన్ని ఒక ఏనుగు పలుమార్లు ఎత్తి పడేసింది. (Elephant Lifts safari Truck) దీంతో ఆ వాహనంలో ఉన్న వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే ఆ ఏనుగు పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దక్షిణాఫ్రికాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం కొంత మంది పర్యాటకులు పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌ను సందర్శించారు. సుమారు 22 మంది సఫారీ వాహనం ఎక్కి ఆ పార్క్‌లో తిరిగారు.
కాగా, సఫారీ వాహనాన్ని భారీ ఏనుగు అడ్డుకున్నది. తన దంతాలతో ఆ వాహనాన్ని పలుమార్లు గాల్లోకి ఎత్తి పడేసింది. దీంతో సఫారీ వాహనంలో ఉన్న పర్యాటకులు భయాందోళన చెందారు. తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ వాహనం బోల్తా పడలేదు.
మరోవైపు సఫారీ వాహనం డ్రైవర్ డోర్‌పై చేతితో కొట్టి శబ్దం చేశాడు. ఏనుగు నుద్దేశించి దూరంగా వెళ్లాలని గట్టిగా అరిచాడు. దీంతో ఆ ఏనుగు పక్కకు వెళ్లింది. ఆ సమయంలో ఆ పార్క్‌లో ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. ఈ వీడియోతో పాటు మరో వాహనంపై ఏనుగు దాడి చేసిన మరో వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq
— Afrocentric (@BantuBold) March 19, 2024
https://twitter.com/githii/status/1769975530479092194?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1769975530479092194%7Ctwgr%5Eebd0f160d504fddc151365b1a5eebe4868841549%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fvideo-shows-scary-moment-when-elephant-lifted-truck-filled-with-tourists-5289576
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

