పుతిన్‌తో మాట్లాడిన తర్వాత… రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు: ఉక్రెయిన్ మంత్రి
కీవ్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు వచ్చిందని ఉక్రెయిన్ మంత్రి అంటోన్ గెరాష్చెంకో ఆరోపించారు. ఉక్రెయిన్‌పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యలో వైఫల్యంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ వైఫల్యానికి ఆయనే కారణమంటూ పుతిన్ మండిపడటంతో యుద్ధానికి సూత్రధారి అయిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు వచ్చిందని ఉక్రెయిన్ మంత్రి అంటోన్ తన షేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అందుకే ఆయన మార్చి 11 నుంచి బహిరంగంగా కనిపించలేదన్నారు.
మరోవైపు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో వైఫల్యం, కీలక నగరాలైన ఖర్కీవ్, కీవ్‌ను రష్యా సైన్యం స్వాధీనం చేసుకోలేకపోవడంపై పుతిన్ ఆయనను శిక్షించినట్లు వదంతులు వచ్చాయి. దీంతో రష్యా ప్రతినిధి దీనిపై స్పందించారు. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక ఆపరేషన్ వల్ల రక్షణ మంత్రి బిజీగా ఉన్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో మార్చి 24న రష్యా రక్షణ మంత్రి టీవీలో కనిపించారు. ఉక్రెయిన్ యుద్ధంపై అధ్యక్షుడు పుతిన్, జాతీయ భద్రతా మండలికి ఆయన టీవీ కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తున్నట్లుగా అందులో ఉన్నది. అయితే ఆయన ఎలాంటి ప్రసంగం చేయలేదు. దీంతో ఇది పాత వీడియోనా అన్న అనుమానాలను కొన్ని మీడియా సంస్థలు వ్యక్తం చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

